12వ ‘అథ్లెటిక్స్’కు బాటసింగారం విద్యార్థుల ఎంపిక
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 07: మండల పరిధిలోని బాటసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్) చెందిన విద్యార్థులు తెలంగాణ 12 వ రాష్ట్ర స్టాయి జాలెలిన్ డే సెలబ్రేషన్ పురుషులు, మహిళలు సబ్ జూనియర్, జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్2026కు ఎంపిక అయ్యినట్లు పాఠశాల హెచ్‌ఎం తెలిపారు.
శనివారం (నేడు) హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ ప్రధాన అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో బాటసింగారం జడ్పీహెచ్‌ఎస్ చెందిన 10వ తరగతి విద్యార్థి ధనాంజనేయులు, 16 ఏండ్ల బాలుర విభాగం జావెలిన్ త్రో పోటీలో అలాగే తులసీ రామ్ 18 ఏండ్ల బాలుర విభాగం 400 మీటర్ల పరుగు పోటీలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించునున్నారు.
అలాగే గత శనివారం ( ఆగస్టు 1)న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో విశిష్ట ప్రతిభ కనబరిచి, ఈ ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం చాలా గర్వంగా ఉందని స్కూల్ హెచ్‌ఎం అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపిక కావడంతో గ్రామ సర్పంచ్, పాలకవర్గం, విద్యార్థుల తల్లింద్రుడులు, గ్రామస్తు లు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పో టీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించి గ్రామానికి, మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకోవాలని ఆకాంక్షించారు.






