తల్లిపాల వారోత్సవాలలో గర్భిణులకు శ్రీమంతం
నేరేడుచర్ల,ఆగస్టు 7 : నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం -1 అంగ న్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా అం గన్వాడీ సూపర్వైజర్ రాజ్యలక్ష్మి మాట్లాడు తూ, గర్భవతి అని తెలియగానే ఎర్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తగినంత విశ్రాంతి ,నిద్ర అవసరమని తెలియజేశారు.
బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రిపాలు కట్టించడం వల్ల బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలియజేశారు. వార్డ్ కౌన్సిలర్ వాసా జ్యోతి మాట్లాడుతూ ప్రతి తల్లి మంచి పోషక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని అంగన్వాడీలో ఆరోగ్య లక్ష్మికి హాజరుకావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమoలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధురి,ఉపాధ్యాయులు పవన్, అంగన్వాడీ టీచర్ ప్రీతి, గర్భవతులు బాలింతలు తల్లులు పాల్గొన్నారు.






