18-09-2025 07:47:46 PM
నిర్మల్ (విజయక్రాంతి): నర్సాపూర్ మండల కేంద్రంలో గల కేజీబీవీ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఎస్ఓ వీణ ఆధ్వర్యంలో రంగురంగుల పూలతో బతుకమ్మలు తయారుచేసి కోలాటం చేస్తూ ఈ సంబరాలు జరుపుకున్నారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.