18-09-2025 07:46:17 PM
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా రాజన్న ఆలయ ఉద్యోగుల యూనియన్ ఘన సన్మానం
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్(MLA Aadi Srinivas) జన్మదిన సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమం దేవస్థానం ఛైర్మన్ గెస్ట్ హౌజ్ నందు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని కొనియాడుతూ యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపి, ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆది శ్రీనివాస్ ని ఉద్యోగుల బృందం శాలువాతో సత్కరించి, ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో వారి అంకితభావం, సేవలను కొనియాడుతూ రాతపూర్వక మెమెంటోను బహుకరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఆలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ఆలయ ఉద్యోగుల సేవలను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.