భద్రకాళి బండ్‌పై బ్యాటరీ వెహికల్..
సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
హనుమకొండ, ఆగస్టు 18 (విజయక్రాంతి): భద్రకాళి బండ్ పై సందర్శకుల సౌకర్యార్థం బ్యాటరీ వెహికల్ సేవలు మంగళవారం అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కలిసి ప్రారంభించారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన బ్యాటరీ వెహికల్ ను ప్రారంభించిన అనంతరం కుడా సిపిఓ అజిత్ రెడ్డి నడపగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న,
తదితరులు భద్రకాళి బండ్ పై ప్రయాణించారు. ఫాతిమ కెనరా బ్యాంక్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్స్ కింద కొనుగోలు చేసిన బ్యాటరీ వెహికల్ ను కుడా కు అందజేశారు. కాగా ఈ వెహికల్ ను ఎమ్మెల్యే చేతులకు మీదుగా ప్రారంభించడంతో సందర్శకుల సౌకర్యార్థం ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా కుడా ఈఈ భీమ్ రావు, కెనరా బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.






