19 August, 2026 | 3:08 AM

ఆస్తి హక్కును పరిరక్షిస్తాం

19-08-2026 12:48 AM
  1. ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వం
  2. ఆటంకాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
  3.   22-ఏ జాబితాలో ఉన్నా 2 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ 
  4. దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దు
  5.   22 ఏ భూములపై సమక్షలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాం తి): భూ హక్కులపై ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రజల ఆస్తి హక్కును పరిరక్షిస్తామని, ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వబోమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 22-ఏ జాబితాలో ఉన్న భూములను 2 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సూచించారు.

22ఏ భూముల అంశంపై మంగళశారం సీఎం రేవంత్‌రెడ్డి.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ.. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉం డకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. 

రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రే షన్ వెంటనే చేస్తారని చెప్పారు. కలెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్నంగా పరిశీలిం చి, శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందిస్తారని, అందులో ఎలాంటి తప్పు లు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రజ లు తమ భూ హక్కుల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. ప్రైవేటు భూములకు సంబం ధించి ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వబోమన్నారు.   22-ఏ భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ప్రజలు ఆశ్రయించవద్దని సూచించారు. 22ఏ భూ ములపై ఎటువంటి పుకార్లు, కట్టు కథలను విశ్వసించవద్దని సీఎం సూచించారు.