మంత్రి పొన్నంను కలిసిన బత్తిని సోదరులు
07-06-2024 02:50 AM
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించనున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి రావాల్సిందిగా బత్తిని సొదరులు హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు గురువారం సచివాలయంలో మంత్రిని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేప ప్రసాదం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం తానే స్వయంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు వచ్చి ఏర్పాట్లను పరిశీలిస్తానని మంత్రి తెలిపారు.






