15 July, 2026 | 10:41 PM

రోడ్ల మరమ్మతులు నాణ్యతతో చేయాలి

07-06-2024 02:48 AM

పంచాయితీరాజ్‌శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాం తాల్లో దెబ్బతిన్న రోడ్లపై గురువారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఆర్‌ఆర్, ఎంఆర్‌ఆర్ నిధులు ఉపయోగించి రహదారులను అభివృద్ధి చేయాలని సూచించారు.

పంచాయతీలు, గ్రామీణ స్థానిక సంస్థల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని చెప్పారు. పంచాయతీల్లో రోడ్లకు మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై అంచనాలు తయారు చేయాలని తెలిపారు. పెండింగ్ పనుల్లో నాణ్యత పెంచే విధంగా చర్యలు తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.