బీజేపీకి గులాబీల మద్దతు
07-06-2024 02:51 AM
అందుకే 8 సీట్లు వచ్చాయి
కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, జూన్6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ మద్దతుతోనే బీజీపీ 8 సీట్లలో గెలిచిందని, వారి నుంచి కేసీఆర్ సుపారీ తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీది బలుపు కాదు, వాపు అని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో గురువారం మాట్లాడుతూ.. సీఎం కు సొంత జిల్లా అంటూ ఏది ఉండదని బీఆర్‌ఎస్ గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ నాయకు లు బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్లే మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఓటమి చెందిందని, ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని పేర్కొన్నా రు. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. బీఆర్‌ఎస్ నాయ కులు ఇప్పటికైనా పార్టీ అధ్యక్ష బాధ్యతలు దళితుడికి ఇచ్చి సామాజిక న్యాయం పాటించాలన్నారు.






