13 July, 2026 | 9:42 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

ఆలయం పట్ల ఉదారత చాటిన బట్టు భూమయ్య

16-02-2026 02:57 PM

ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి మండల కేంద్రానికి చెందిన బట్టు భూమయ్య గౌడ్ తమ యొక్క ఉదారతను చాటుకున్నారు. తమ కులదైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా అత్యంత చొరవ తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అధునాతనమైన రూ. 75000/- విలువగల మార్బుల్స్ (పాలరాయి) వేయించి, ఆలయ సుందరీకరణకు తన వంతు సహకారాన్ని అందించారు. ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతమని, భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే పాలరాయి వేయించినట్లు బట్టు భూమయ్య తెలిపారు. బట్టు భూమయ్య సేవల పట్ల గౌడ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.