25-08-2025 01:44:36 AM
కరీంనగర్, ఆగస్టు 24 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్రకు పలు బీసీ సంఘాలు సంఘీభావం తె లిపాయి. ముదిరాజ్, మున్నూరుకాపు, యా దవ్, గౌడ, పద్మశాలి సంఘాలు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర కు స్వాగతం పలికాయి. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న బిసి రిజర్వేషన్లు పై వారు హర్షం వ్యక్తం చేస్తూ పాదయాత్ర లో పాల్గొన్నారు.- కురిక్యాలలో ఇందిరమ్మ ఇల్లు పరిశీలనకురిక్యాల లో ఇం దిరమ్మ లబ్ధి దారులు భాగ్య- గంగయ్య దంపతుల ఇళ్లును టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇతర నేతలుపరిశీలించారు.
పీసీసీ చీఫ్‌కు ఘన స్వాగతంపలికిన సుడా చైర్మన్
కరీంనగర్, ఆగస్టు 24 (విజయ క్రాంతి): జనహిత పాదయాత్ర వెళ్తున్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వా గతం లభించింది. కరీంనగర్ ఎన్టీ ఆర్ విగ్ర హం వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్వాగతంపలికారు.