calender_icon.png 25 August, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతంపేటలో గొర్ల మంద వద్ద కొండచిలువ హతం

25-08-2025 09:18:16 AM

ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని సీతంపేట గ్రామ సమీపంలో గొర్ల మంద వద్ద గొర్ల కాపరులు పెద్ద కొండచిలువను(Python ) హతమార్చారు. గ్రామానికి చెందిన  కురాకుల రాయమల్లు యాదవ్,  రజనీకాంత్ యాదవ్ ల గొర్ల మంద వద్ద కొండచిలువ కనిపించగా, గొర్ల కాపర్లు ఆ కొండచిలువను చూసి హైరానా పడ్డారు. ఆ కొండచిలువ గొర్రెలను పట్టిందే కు వచ్చిందని గమనించిన గొర్ల కాపర్లు వెంటనే ఆ కొండచిలువను అతి కష్టంగా హతమర్చారు. అటవీ సమీపంలో ఉన్న గ్రామంలోకి కొండచిలువలు ప్రవేశిస్తుండడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.