25-08-2025 02:07:27 AM
హైదరాబాద్‌లో ఐటీ కారిడార్ మార్గాల్లో 25 శాతం అధికంగా ట్రాఫిక్
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రస్తుతం అంతర్జాతీయ సాంకే తిక కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ నగరం నిలుస్తోంది. వందలాది ఐటీ కంపెనీల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఉపాధి, అభివృద్ధిలో సమాంతరంగా ముందుకెళ్తున్న సాంకేతిక రంగం హైదరాబాద్ నగరంలో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణ మవుతున్నది. కరోనా విలయం కారణం గా ఐటీ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించా యి.
అయితే ఆ సమయంలో కంపెనీలకు నిర్వహణ ఖర్చు ఆదా అయింది. కానీ ఖర్చు కలిసి వస్తుందని చూస్తే ఉద్యోగుల పని సామర్థ్యం తగ్గిపోతుందని భావించిన కంపెనీలు ఉద్యోగులందరూ మళ్లీ ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి. చాలాకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఉద్యోగులు మళ్లీ ఆఫీసులకు రావడంపై పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడంతో కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి.
అయితే హైదరా బాద్ నగరంలో ప్రస్తుత ట్రాఫిక్ రద్దీ పెరగడంలో ఈ హైబ్రిడ్ విధానమే కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగులు వారికి అత్యంత వెసులుబాటు ఉండే విధంగా వారం మధ్యలోనే ఆఫీసులకు వస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నది. తద్వారా అందరూ అనేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు.
ఆ మూడు రోజులూ
వాస్తవానికి ఐటీ ఉద్యోగులు వారం లో ఐదు రోజులు మాత్రమే పనిచేస్తారు. శని, ఆదివారం వీక్లీ ఆఫ్ కాగా సోమవా రం నుంచి శుక్రవారం వరకే వారు పనికి హాజరు అవుతారు. కరోనా విలయం కారణంగా హైబ్రిడ్ విధానం అందుబాటులో రావడంతో ఐదు రోజుల్లో మూడు రోజు లు ఆఫీస్‌కు రావాలని, రెండు రోజులు ఇంటి నుంచి పని చేయొచ్చని ఐటీ కంపెనీలు అవకాశం కల్పించాయి. ఈ క్రమం లో వారం మధ్యలో ఆఫీసు వచ్చే విధం గా ఐటీ ఉద్యోగులు ప్రణాళిక చేసుకుంటున్నారు.
అయితే నిజానికి ఆదివారం సెల వు తర్వాత సోమవారం నగరంలో ట్రాఫి క్ అధికంగా ఉంటుంది. దీనికితోడు వీక్లీ ఆఫ్ ముందు శుక్రవారం కూడా ఆఫీసు రావడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో ఐటీ ఉద్యోగులందరూ మంగళ, బుధ, గురువారం ఆఫీసు వచ్చేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే టెకీ లందరూ ఈ విధానాన్ని ఎంపిక చేసుకోవడంతో సోమవారానికి బదులుగా మంగళ, బుధ, గురు వారాల్లో ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతున్నది.
హైబ్రిడ్ విధా నం కారణంగా ఈ మూడు రోజుల్లో కంపెనీల కార్యకలాపాలు అధికంగా ఉండటంతో హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ మరింత తీవ్రమవుతోంది. అయితే హైబ్రిడ్ విధానం వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని సమతుల్యం చేస్తుందని ఉద్యోగులు చెబుతున్న ప్పటికీ ట్రాఫిక్ రద్దీ కీలక రహదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
25 శాతం పెరుగుదల
హైదరాబాద్‌లో ఐటీ రంగం గణనీయమైన అభివృద్ధి చెందుతుండటంతో నగరం లోని అనేక ప్రాంతాల నుంచి ఆఫీసులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. ఈ క్రమంలో హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ, హఫీజ్‌పేట, కేపీహెచ్‌బీ వరకు, లింగంపల్లి రోడ్డు, గచ్చిబౌలి ఫ్లుఓవర్, టోలిచౌకి, రాయదుర్గంతో కలిపే షేక్‌పేట ఫ్లుఓవర్, బొటా నికల్ గార్డెన్, కొత్తగూడకు దారితీసే గచ్చిబౌలి రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. సగటున ప్రతిరోజూ 10 లక్షలకు పైగా వాహనాలు కీలకమైన ఐటీ మార్గాల్లో తిరుగుతున్నాయి.
సైబరాబాద్‌లోని ట్రాఫిక్ పోలీసు అధికారుల వివరాల ప్రకారం, ఐటీ కారిడార్‌ను అనుసంధానించే మార్గాల్లో మంగళ, బుధ, గురువారాల్లో ట్రాఫిక్ కనీ సం 25 శాతం పెరుగుదల కనిపిస్తుంది. అం దులోనూ మంగళ, బుధవారాలు మరీ ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ రోజుల్లో ట్రాఫిక్ సాధారణంగా సోమ, శుక్రవారాల కంటే 20 శాతం ఎక్కువగా ఉంటుంది. మంగళ, బుధవారాలతో పోలిస్తే గురువారం 10 శాతం పెరుగుదలతో ట్రాఫిక్ మెరుగ్గా ఉంటుంది.
8 గంటలే కీలకం
ఐటీ ఉద్యోగుల హైబ్రిడ్ విధానం కారణంగా మంగళ, బుధ, గురువారాల్లో పెరు గుతున్న ట్రాఫిక్ రద్దీ ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు ప్రభావం చూపుతున్నది. ఉదయం 8 గంటల నుంచి 12 గం టల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు మొత్తంగా రోజులో 8 గం టల పాటు ట్రాఫిక్ రద్దీ సమస్య తలెత్తుతున్నది. ఈ సమయంలో ఐటీ కారిడార్ మా ర్గాల్లో ప్రయాణించే వాహనాల్లో అధిక శా తం ఐటీ ప్రయాణీకులకు సంబంధించినవే ఉంటున్నాయి.
హైదరాబాద్ వ్యాప్తంగా రోజూ 33,000 ఆటోలు నడుస్తుండగా వాటిలో 10 శాతం (3,300) వాహనాలను ఐటీ ఉద్యోగులే వినియోగిస్తున్నారు. ఐటీ కారిడార్ మార్గంలో ప్రయాణించే 1.2 లక్షల బైక్‌లలో కనీసం 50 శాతం (60,000) బైకులు ఐటీ ఉద్యోగులకు చెందినవే ఉంటున్నాయి.
3,347 బస్సులలో 80 శాతం (2,667) బస్సులు ఆయా మార్గాల్లో ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగులకు సేవలు అందిస్తున్నాయి. దీంతోపాటు 93 వేల కార్లలో 25 శాతం (23,250) టెకీలే ప్రయాణిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ రోజురోజుకూ పె రుగుతున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు పని షెడ్యూల్‌లను మార్చిస్తే ట్రాఫిక్‌ను ని యంత్రించేందుకు అవకాశం లభిస్తుందని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు.