19-10-2025 01:10:42 AM
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన తెలంగాణ మ రో చరిత్రాత్మక ఉద్యమానికి నాంది పలికింది. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి ప్రత్యేక రా ష్ట్రం సిద్ధించడంలో కీలక పాత్ర పోషించిన బీసీల ప క్షాన నేడు యావత్తు ప్రజానీకం నిలబడింది. బీసీల ఆకాంక్షల సాధన లక్ష్యంగా రాష్ట్రంలో చేపట్టిన బీసీ బంద్‌కు తెలంగాణ సకలం మద్దతుగా నిలిచింది.
ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న బీసీలకు అండగా ప్రతి ఒక్కరూ కదిలారు. రాష్ట్రమంతటా కుల, మత, రాజకీయాలకు అతీతంగా అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మేము సైతం అంటూ సబ్బండ వర్ణా లు బీసీల కోసం బంద్‌కు సహకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే అంశం ఇంకా కొలిక్కి రాకపోవడంతో బీసీలంతా ఏకమయ్యారు.
బీసీ జేఏసీగా ఏర్పాటై ఉమ్మడిగా పోరాటాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ బీసీ బంద్ ప్రశాంతంగా మొదలై విజయవంతంగా ముగిసింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న కాం గ్రెస్, ప్రతిపక్ష పార్టీలు బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, టీజేఎస్ మద్దతు తెలిపాయి.
బీసీలకు అందరి అండ..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బంద్ విజయవంతమైంది. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయా యి. ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. పాఠశాలలు, వ్యాపార కేంద్రాలు, మార్కెట్లు స్వచ్ఛందంగా మూసేయడంతో బంద్ ప్రశాంతంగా ముగిసింది. పోలీసులు వ్యూహాత్మకంగా భద్రతా బలగాలను మోహరించి బంద్‌ను పర్యవేక్షించారు. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా పిలుపునిచ్చిన బీసీ బంద్‌కు ప్రజల నుంచి బలమైన మద్దతు కనిపించింది.
అన్ని రాజకీయ పార్టీల నాయకులతోపాటు ప్రజలు ర్యాలీల్లో పాల్గొన్నారు. బంద్‌లో భాగంగా 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వచ్ఛందంగా పాల్గొన్నా రు. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురవుతున్నా వెనుకబడిన తరగతులకు తెలంగాణ రాష్ట్రం అండగా ఉందని బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా స్పష్టంచేశారు. ఫలితమే మిగిలి ఉంది..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం బీసీలు పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే అన్ని వర్గాలు ఒకే వేదికపైన మూకుమ్మడిగా బీసీలకు మద్దతు తెలపడం విశేషం గా మారింది. ఇప్పటివరకు ఆయా రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ఇతరులు ఎవరికి వారుగా బీసీ రిజర్వేషన్ అంశానికి సహకరించాయి. ప్రస్తుతం రాజకీయాలకు అతీతంగా ముందడుగు పడింది.
ఈ పరిణామం బీసీల దశాబ్దాల పోరాటానికి మరింత ఊతమిచ్చినట్టు అయింది. ఇంతకాలం బీసీలు చేసిన ప్రయత్నాలు సాకారమవుతాయనే నమ్మకాన్ని వారిలో కల్పించేందుకు తెలంగాణలో విజయవంతమైన బీసీ బంద్ ఎంతో దోహదపడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బీసీ బంద్ సామాజికంగా, రాజకీయంగా విజ యం సాధించింది. తమ హక్కులను సాధించుకుంటామనే భరోసాను బీసీల్లో నింపింది.
బీసీ బంద్ నేపథ్యంలో హామీ ఇచ్చినవారు, అమలు చేయాల్సినవారు, బీసీల పక్షాన పోరాటం చేస్తున్న వారందరూ రిజర్వేషన్ ఫలితం పొందాల్సిన బీసీలకు మద్దతు నిలవడంతో ఇకనైనా బీసీ ఆకాంక్షలకు తెరపడు తుందని విశ్వసిస్తున్నారు. బీసీ బంద్ విజయంతో బీసీలకు అనుకూలంగా ఇక నిర్ణయా త్మక ఫలితమే మిగిలి ఉందని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
బీసీ కోటా డిమాండ్ అత్యంత న్యాయమైనది. అగ్రకుల పేదలకు ఈడబ్ల్యూఎస్ కోటా అమలవుతున్నప్పుడు బీసీలకు కోటా ఎందుకివ్వరు?
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి, బీసీ కోటా బిల్లుకు ఆమోదం తెలపాలి. త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తాం.
చట్ట సభల్లో బీసీ కోటా సాధించే వరకు తెగించి పోరాడుతాం. బంద్ విజయవంతమైంది. అందరికి కృతజ్ఞతలు. త్వరలో భవిష్యత్ ప్రణాళిక.
బీసీ ఉద్యమాన్ని ఆపేదిలేదు. బీసీల తడాఖా ఏంటో చూపిస్తాం. బంద్‌తో బీసీల ఐక్యత చాటిచెప్పాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లుతెరవాలి.
బీసీ కోటాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ రక్షణ కల్పించాలి.
సీఎం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. లేదంటే తెలంగాణ ఉద్యమం వలే బీసీ ఉద్యమాన్ని రగిలిస్తాం.