16 May, 2026 | 2:09 AM

బావిలో పడి బాలుడి మృతి

16-05-2026 12:00 AM
  1. ఈత రాకపోవడంతో ప్రమాదం
  2. గరిడేపల్లి మండలం మంగాపురంలో ఘటన

గరిడేపల్లి, మే 15 (విజయక్రాంతి) : ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని మంగాపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీస్‌లు తెలిపిన వివరాల మేరకు మంగాపురం గ్రామానికి చెందిన గుండు అంజయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గుండు సాయి (14) నేరేడుచర్లలోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసి వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సాయి తన స్నేహితులతో కలిసి తాటిముంజకాయల కోసం పొలాల వద్దకు వెళ్లారు. అనంతరం అక్కడే ఉన్న బావిలో స్నేహితులు ఈతకు దిగారు.అయితే సాయి ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడన్నారు. అతనికి ఈత రాకపోవడంతో ము నిగి మృతి చెందాడన్నారు. మృతుని తండ్రి గుండు అంజయ్య పిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బీశ్రీకాంత్ గౌడ్ తెలిపారు.