బీసీ వర్గాలు ఆత్మగౌరవంతో ఎదగాలి
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
ఎల్బీనగర్, ఏప్రిల్ 19 : బీసీ వర్గాలు ఆత్మగౌరవం తో ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. పెరిక కులస్తుల బాంధవుడిన్ని నీనే అని ఆయన ప్రకటించుకు న్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కమలనగర్ కాలనీ సాయిగార్డెన్స్ లో ఆదివారం పెరిక బాలికల వసతిగృహం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి హరిశ్ రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ప్రభుత్వ మాజీ విప్ లు, పెరిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... తెలంగాణ సమాజం బీసీ వర్గాలది అని, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని కులాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించి, ఆత్మగౌరవ భవనా లను నిర్మించినట్లు తెలిపారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ... తాను పెరిక విద్యార్థి వసతి గృహంలో ఉంటూ చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు.
పెరిక కులస్తులు దేశ నిర్మాతలని, కుల వృత్తిని దాటి ఉన్నతంగా సామాజికంగా ఎదుగుతున్నారని తెలిపారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న పెరిక బాలికల వసతిగృహం నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఇందుకు రూ, 5 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... పెరిక కులస్తుల ఉన్నతికి సంపూర్ణంగా కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్, బోడకుంటి వెంకటేశ్వర్లు, మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య, మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం గౌరవాధ్యక్షుడు మద్దా లింగయ్య, అధ్యక్షుడు డాక్టర్ గటిక విజయ్ కుమార్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటి చైర్మన్ సుందరి వీరభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రాజ్యాధికారం కల సఫలం అవుతుంది
సికింద్రాబాద్: మనం కలలు కన్నా రాజ్యాధికారం త్వరలోనే తప్పకుండా సఫలం అవుతుంది అన్ని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన బీసీ జన జాతర కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఈటల మాట్లాడారు.






