8 April, 2026 | 3:30 AM

నేడు బీసీ కాంట్రాక్టర్ల మహా ధర్నా

08-04-2026 01:48 AM

ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటలకు నిర్వహణ

పాల్గొననున్న టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో బీసీ కాంట్రాక్టర్లకు 42శాతం కాంట్రాక్టులు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీని అమ లు చేయకుండా బీసీ సమాజాన్ని మోసం చేసిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీ కాంట్రాక్టర్లకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా,వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా టీఆర్పీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బుధవారం హై దరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఉద యం 10 గంటలకు నిర్వహించనున్న మహా ధర్నాకు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొని బీసీ కాం ట్రాక్టర్ల పోరాటానికి బలమైన మద్దతు తెలుపనున్నారు. ఈ సందర్భంగా పార్టీ పలు డి మాండ్లను స్పష్టం చేసింది. 42 శాతం కాంట్రాక్టుల హామీపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలి. బీసీ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే నిలిపివేయాలి. కాంట్రాక్టుల్లో అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని తగ్గించి, సమాన అవకాశాలు కల్పించాలని టీఆర్పీ స్పష్టం చేసింది. బుధవారం జరగనున్న మహా ధర్నాలో పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీగా పాల్గొని కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.