calender_icon.png 15 July, 2025 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ ధర్నా వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

15-07-2025 12:58:59 AM

చౌటుప్పల్, జూలై 14 (విజయ క్రాంతి):  హైదరాబాదులో జులై 15వ తేదీ న ఇంద్ర పార్క్ దగ్గర మహాధర్నా బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాను బిసి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కుల సంఘాల నాయకులు తాజా మాజీ  బీసీ ప్రజా ప్రతినిధిలు, వార్డు సభ్యులు, సింగల్ విండో డైరెక్ట్ ,సర్పంచులు ఎంపీటీసీ, జడ్పిటిసి  ,మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ,జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు ,

ఎంపీలు విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఆర్డినెన్స్ ఇవ్వడం ఏ విధంగానూ చట్టబద్ధత కల్పించినట్లు కాదు.

బీసీలను మోసం చేయడానికి ఇది మరో రూపం మాత్రమే.   పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ చేయించి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేర్చడమొక్కటే పరిష్కారం. ఆ ప్రయత్నం చేయకుండా హామీ చేసినప్పటికీ బీసీ లను మోసగించడం తప్ప మరేం కాదు. 

అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   రాజకీయ డ్రామాలు పక్కనపెట్టి తమిళనాడు తరహాలో తక్షణమే అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్షాన్ని  ఏర్పాటు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  కలిసి రాజకీయంగా ఒత్తిడి చేస్తేనే సాధ్యమవుతుంది. 

ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నాగయ్య ,కొత్త పర్వతాలు యాదవ్, ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, చిన్నం బాలరాజు కురుమ ,సిద్ధగొని శ్రీనివాస్ ,మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్ ,గంగదేవి రమేష్ బాబు ముదిరాజ్ ,చెవగొని మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు