calender_icon.png 15 July, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొంపల్లి డ్రగ్స్ కేసులో సీనియర్ పోలీస్ అధికారి కుమారుడు

15-07-2025 12:24:57 PM

కొంపల్లి డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న ఈగల్ టీమ్ దర్యాప్తు

హైదరాబాద్: కొంపల్లి డ్రగ్స్ కేసులో(Kompally Drug Case) ఈగల్ టీమ్ దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో పోలీసు అధికారుల కుమారుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో ఇద్దరు పోలీసు అధికారుల కుమారులున్నట్లు గుర్తించారు. ఇటీవల మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో సూర్య అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు సూర్యకు రాహుల్ తేజ్ కు సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ్. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ కుమారుడి వ్యవహారంపై ఈగల్ టీమ్ ఆరా తీసింది. నిజామాబాద్ లో గతేడాది నమోదైన డ్రగ్స్ కేసులో రాహుల్ తేజ్ పరారీలో ఉన్నాడు. డ్రగ్స్ కేసులో రాహుల్ తేజ్ కీలక సూత్రధారిగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రాహుల్, సూర్య, హర్ష కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కేసులో నిన్న హర్ష, మోహన్ అనే ఇద్దరికి రిమాండ్ విధించారు. మోహన్, సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవరావు కుమారుడిగా గుర్తించారు.