15-07-2025 12:27:23 PM
బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామంలో ఘటన.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): గుర్తు తెలియని దుండగుల చేతిలో ముసుగులో ఉన్న అంబేద్కర్ విగ్రహం(Ambedkar statue) ధ్వంసమైన ఘటన నాగర్ కర్నూలు జిల్లా(Nagarkurnool district) బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించేందుకు దాతల సాయంతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సోమవారం గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. ముసుగులోనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కుడి చేతి మణికట్టు, వేలు విరిగి కింద పడింది. దీని గమనించిన దళిత సంఘాల నేతలు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపడుతున్నారు.