8 August, 2026 | 2:32 AM

బీసీ ‘సర్జికల్ స్ట్రైక్- 59’

08-08-2026 12:28 AM
  1. 59 నియోజకవర్గాల్లో బీసీల రాజ్యాధికార పోరు
  2. కత్తెర గుర్తుతో అగ్రవర్ణాల రాజకీయ గుత్తాధిపత్యానికి చెక్
  3. 2028లో బీసీల రాజ్యాధికారమే లక్ష్యం
  4. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఆగస్టు 7: తెలంగాణలో రెడ్డి, వెలమ, కమ్మ సామాజికవర్గాల రాజకీ య ఆధిపత్యానికి ముగింపు పలికి, బీసీలకు రాజ్యాధి కారం సాధించాలనే లక్ష్యంతో తెల ంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ‘సర్జికల్ స్ట్రైక్-59’ కార్యక్రమా న్ని ప్రారం భించారు. కత్తెర గుర్తుతో అగ్రవర్ణాల రాజకీయ గుత్తాధిపత్యాన్ని కత్తిరిస్తా మని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూ ర్, బోధన్, నిర్మల్, బాన్స్‌వాడ నియోజక వర్గాల ఎన్నికల చరిత్ర, ఓటర్ల గణాంకాలు, ప్రజాప్రతినిధుల వివరాలను శుక్రవారం వెల్లడించారు.

ఆర్మూర్‌లో 1,35,999 బీసీ ఓట్లు ఉండగా, కేవలం 7,984 ఓట్లు ఉన్న రెడ్లే 14 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారని, బోధ న్ 1,42,401 బీసీల ఓట్లు ఉండగా, కేవలం 8,360 రెడ్ల ఓట్లు ఉన్నాయని తెలిపారు. ని ర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి రాజకీయాలే నడుస్తున్నాయని, బీసీ ఓట్లు 1,54, 159 ఉండగా, రెడ్ల ఓట్లు 7,237లే ఉన్నాయ ని స్పష్టం చేశారు. బాన్స్‌వాడలో పోచారం కుటుంబ ఆధిపత్యం చెలాయిస్తోంద ని విమర్శించారు. ఇక్కడ బీసీల ఓట్లు 1,24,439 ఉండగా, రెడ్ల ఓట్లు కేవలం 8,697 మాత్రమేనని చెప్పారు.

59 నియోజకవర్గ స్థానా ల్లో కోటి మంది బీసీల ఓట్లు ఉంటే, కేవలం 8 లక్షల అగ్రవర్ణ ఓట్లు ఉన్నాయని స్పష్టం చేశారు. బీసీలు 2028 లక్ష్యంగా ఐక్యం కా వాలని, 59 స్థానాల్లో బీసీ జెండా ఎగరాలనిన్నారు. 1952 నుంచి ఆర్మూర్‌లో జరిగి న 16 ఎన్నికల్లో 14 సార్లు రెడ్లే ఎమ్మెల్యేలు అ య్యారని తెలిపారు.

బోధన్‌లో ఎం నారాయణరెడ్డి, పీ సుదర్శన్‌రెడ్డి, షకీల్ అహ్మద్ వంటి నాయకులు అధికారాన్ని అనుభవించారన్నారు. నిర్మల్‌లో ఇప్పటి వరకు ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా గెలవలేదన్నారు. అల్లొ ల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వం టి నాయకులే అధికారాన్ని పంచుకు న్నారని విమర్శించారు. బాన్స్‌వాడలో పోచారం శ్రీ నివాస్‌రెడ్డి కుటుంబ రాజకీయాలకు 2028 లో ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

నేడు ఉమ్మడి వరంగల్‌లో తీన్మార్ మల్లన్న పర్యటన

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శనివా రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించను న్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించడంతో పాటు యువతతో ప్రత్యేక సమావే శం, పార్టీ అంతర్గత సమావేశంలో పాల్గొననున్నారు.

కాజీపేట జంక్షన్‌లో, వడ్డేపల్లిలో, సుధానగర్, రంగశాయిపేట జంక్షన్, కాశీబుగ్గ ప్రాంతాల్లో పర్యటించ నున్నారు. హ నుమకొండ అంబేద్కర్ భవన్‌లో నిర్వహిం చే ‘యూత్ మీటప్ విత్ తీన్మార్ మల్లన్న’లో పాల్గొంటారు. అనంతరం వరంగల్‌లో పార్టీ అంతర్గత సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.

59 స్థానాల్లో కోటి మంది బీసీలు.. 8 లక్షలే అగ్రవర్ణ ఓట్లు 

సర్జికల్ స్ట్రైక్-59 పరిధిలోని 59 నియోజకవర్గాల్లో సుమారు 96.59 లక్షల మంది బీసీ ఓటర్లు ఉన్నారని, రెడ్డి, వెలమ, కమ్మ సామాజిక వర్గాల ఓటర్లు కలిపి 8 లక్షలకు కూడా చేరుకోరని మల్లన్న పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ 59 స్థానాల్లో అగ్రవర్ణాలకే ప్రాతినిథ్యం దక్కడం సామాజిక న్యాయానికి విరుద్ధమని స్పష్టం చేశారు. 2028 ఎన్నికల్లో ఈ 59 నియోజకవర్గాల్లో బీసీల రాజకీయ చైతన్యాన్ని పెంచి, రాజ్యాధికార పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యమని తెలిపారు.

‘బీసీల ఓట్లతోనే బీసీల రాజ్యాధికారం సాధిస్తాం’ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 59 స్థానాల్లో రెడ్డి, వెలమ, కమ్మ సామాజికవర్గాలు రాజకీయ అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాయని, ఈ గుత్తాధిపత్యాన్ని ‘కత్తెర’ గుర్తుతో కత్తిరించడమే టీఆర్పీ లక్ష్యమని ప్రకటించారు. టీఆర్పీ ‘కత్తెర’ గుర్తు అగ్రవర్ణాల రాజకీయ గుత్తాధిపత్యాన్ని కత్తిరించే ఆయుధమని అభివర్ణించారు. బీసీలందరూ ‘బిగ్ క్లాస్’ సిద్ధాంతంతో కొత్త రాజకీయ నినాదం అందుకోవాలని తెలిపారు. బీ-ఫామ్‌ల కోసం అగ్రవర్ణ పార్టీల చుట్టూ తిరిగే రోజులు ముగియాలన్నారు.