బీసీలకు ఐదు మంత్రి పదవులు ఇవ్వాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్
ముషీరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు బీసీలకు ఇచ్చిన మంత్రి పదవులు కేవలం రెండు మాత్రమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీలకు జనాభా ప్రకారం రాజకీయ ప్రాతినిథ్యం కల్పిస్తామని ప్రకటించారని, ఆ ప్రకారమే మంత్రి పదవులు కేటాయించాలన్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీసీలకు తక్కు వ సీట్లు ఇచ్చారని, కనీసం మంత్రి పదవుల్లోనైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం సంఘం నేతలు చిల్లంపల్లి రమేష్, టి.నంద గోపాల్, వేముల రామకృష్ణ, కోటేశ్వరి, మేడి రాందేవ్, అమృత పాల్గొన్నారు.






