03-07-2025 12:40:09 AM
మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని అభినందించిన తీన్మార్ మల్లన్న
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2: మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులుగా గెలుపొందిన సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ మరియు నూతన కార్యవర్గం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను బోడుప్పల్‌లోని క్యూ న్యూస్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మున్నూరు కాపులు ఎన్నికల ద్వారా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి లను ఎన్నుకోవడం శుభపరిణామం అని అంటూ ఎన్నకైనా వారిని అభిందించారు.
మున్నూరు కాపులు ఐక్యమత్యం అవుతూ బీసి కులాలను కలుపుకొని రాజ్యాధికారం వైపు పయనించాలని కోరారు. ఎల్లా వేళల తన వంతు కర్తవ్యంగా సంఘం కు అండగా ఉంటానని తెలిపారు. మున్నూరు కాపులను గ్రామ స్థాయి నుండి పటిష్టం చేయాలన్నారు.
ఈ సందర్బంగా అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ తో పాటు ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య, కోశాదికారి కంచి సత్యనారాయణ, కార్యనిర్వాహన అధ్యక్షులు బుక్క వేణు గోపాల్, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ మాజీ అధ్యక్షులు కాశెట్టి ఆనంద్,పీర్జాది గూడ సం ఘం అధ్యక్షులు బల్లెపు చంద్రశేఖర్ (చందు), ప్రధాన కార్యదర్శి లక్కాకుల సంజీవ రిటైర్డ్ ఎస్పీ రాంపల్లి జైహింద్, నల్గొండ జిల్లా అధ్యక్షులు వాసు దేవుల వెంకట నర్సయ్య, ప్రధాన కార్యదర్శి నేతి వెంలాటేశ్వర్లు, మిర్యాల గూడా కోఆర్డినేటర్ పందిరి వేణు, అంబర్‌పేట కో ఆర్డినేటర్ ఉప్పు సత్యనారాయణ, పోతం శెట్టి భరత్, మట్టి బాల రాజు, కోనేట్ వెంకట్, తునికి శ్రీనివాస్, యాసం నరేష్, బాలక్రిష్ణ, పాశం సత్తయ్య, శంకర్, ఆకుల మధూకర్, అశోక్, పాపయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.