calender_icon.png 9 July, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటీఎంను లూటీ చేసిన ముసుగు దొంగలు

09-07-2025 08:21:43 AM

జీడిమెట్లలో ఏటీఎం చోరీ

ఏటీఎం ధ్వంసం.. క్యాష్ బాక్స్ ఎత్తుకెళ్లిన దుండగులు

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పరిధిలోని మార్కండేయనగర్(Markandeya Nagar) లో ఏటీఎంలో చోరీ జరిగింది. హెచ్​డీఎఫ్​సీ(Housing Development Finance Corporation) బ్యాంకు ఏటీఎంలో దూరిన ముగ్గురు వ్యక్తులు గ్యాస్ కట్టర్ ఉపయోగించి మూడు యంత్రాలను పగలగొట్టారు. అనంతరం గంటలోపు భారీ నగదుతో ఉన్న క్యాష్ బాక్స్ తో పారిపోయారు. మంగళవారం రాత్రి బాలానగర్ పోలీసులు(Balanagar Police) జీడిమెట్లలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్(Cordon and search) జరిగిన ఏరియాలోనే దుండగులు ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీకెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.