calender_icon.png 9 July, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్లపై చర్చకు ఎక్కడైనా సిద్ధం

03-07-2025 12:39:06 AM

  1. వచ్చే వారం కృష్ణా జలాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
  2. మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి శ్రీహరి కౌంటర్ 

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): బనకచర్లపై చర్చిండానికి ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమేనని మాజీ మంత్రి హరీశ్‌రా వుకు మంత్రి వాకిటి శ్రీహరి కౌంటర్ ఇచ్చా రు. బనకచర్ల విషయంలో హరీశ్‌రావే తడబడుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోం దన్నారు. రోజా ఇంటిలో చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమగా మా రుస్తానని కేసీఆర్ చెప్పింది వాస్తవం కాదా అని మంత్రి ప్రశ్నించారు.

బుధవారం గాంధీభవన్‌లో ‘మంత్రులతో ప్రజలు’ ముఖా ముఖి కార్యక్రమానికి మంత్రి శ్రీహరి హాజరయ్యారు. ఈ సం దర్భంగా ప్రజల నుం చి వినతులు స్వీకరించారు. అనంతరం మీ డియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వచ్చే వారం కృష్ణానదీ జలాలపై పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ఉంటుందని తెలిపారు. బీసీల విషయంలో బీజేపీ పక్షపాత వైఖరిని అవలంభిస్తోంద న్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో మరోసారి బీ సీ వ్యతిరేకి అని స్పష్టమైందన్నారు.

గతంలో బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తొలగించి కిషన్‌రెడ్డికి ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత కూడా బీసీల విషయంలో బీజేపీ పక్షపాత వైఖరిని అవలంభిస్తోందని మంత్రి శ్రీహరి మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ పార్టీలో అధ్యక్ష పదవి లేదంటే వర్కింగ్ పదవిని బీసీలకు ఇచ్చేలా ఎమ్మెల్సీ కవిత చూడాలని మంత్రి సూచించారు. కవిత రైల్‌రోకో కార్యక్రమం చేపట్టే ముందు పార్టీలో బీసీలకు కీలక పదవి ఇచ్చేలా ఆలోచించాలన్నారు. రాహుల్‌గాం ధీ ఆలోచన, సూచనల మేరకే ఎవరి వాటా వారికే దక్కాలనే నినాదంతో కులగణన పారదర్శకంగా నిర్వహించినట్లు చెప్పారు.