అప్రమత్తంగా ఉండాలి
15-05-2024 01:58 AM
మధుయాష్కీగౌడ్
ఎల్బీనగర్, మే 14 : లోక్‌సభ ఫలితాలు ప్రకటన వరకు కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సూచించారు. బుధవారం వనస్థలిపురంలోని పార్టీ కార్యాలయంలో 11 డివిజన్ల అధ్యక్షులు, నాయ కులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలింగ్ ఏజెంట్లతో మాట్లాడి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సమావేశంలో ఎన్నికల చీఫ్ ఎజెంట్ వెంకట్‌యాదవ్, తులసి శ్రీనివాస్, కార్పొరేటర్ సుజాతానాయక్, నాయకులు వజీర్ ప్రకాశ్‌గౌడ్, ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.




