l రైతన్నకు పోలీస్ సాయం
15-05-2024 02:02 AM
నాగర్‌కర్నూల్, మే 14 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో రైతులు విక్రయించడానికి తెచ్చిన వడ్లు తేమశాతం ఎక్కువగా ఉండటంతో ఆరబోసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై, చినుకులు పడుతున్న క్రమంలో అక్కడి రైతులు వడ్లను దగ్గరకు చేర్చుతున్నారు. వీళ్ల పరిస్థితిని గమనించిన అక్కడే ఉన్న పోలీసులు రైతులకు సాయంగా వచ్చి వడ్లను దగ్గరకు చేర్చారు. అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.




