calender_icon.png 4 July, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధైర్యంగా ఉండండి

04-07-2025 12:46:29 AM

- దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

చిన్న చింతకుంట జూలై 3 : ఆరోగ్యం బాగాలేదని అధర్యపడకూడదని ధైర్యంగా ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి భరోసానిచ్చారు. గురువారం అడ్డాకుల మండలం రాచాల గ్రామానికి చెందిన వరుణ్ కుమార్ చిన్నారి వైద్యం కొరకు ని మ్స్ ఆస్పత్రికి సీఎం సహాయ నిధి ద్వారా రూ 7 లక్షలను, కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన పెద్ది నాగన్న గారి వైద్యం కొరకు నిమ్స్ ఆస్పత్రికి  చికిత్స పొందుతున్న వ్యక్తికి రూ 2 లక్షల 50 వేల ఎల్‌ఓసి ని వారి కుటుంబ సభ్యులకు  దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ. జి. మధుసూధన్ రెడ్డి అందజేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలోనూ మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, కార్పొరేట్ ఆసుపత్రిలో పేదలు వైద్య సేవలు పొందిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.