calender_icon.png 4 July, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల మధ్య అకడమిక్ ఒప్పందం

04-07-2025 12:44:43 AM

  1. విద్యారంగంలో నూతన మైలురాయి
  2. ఇంగ్లీష్ విభాగంలో నాణ్యమైన విద్యకు కొత్త దిశ

సిద్ధిపేట, జూలై 3(విజయక్రాంతి): విద్యారంగంలో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించేందుకు సిద్ధిపేట జిల్లాలోని రెండు ప్రముఖ ప్రభుత్వ రంగ డిగ్రీ కళాశాలలైన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తత కలిగినది), సిద్ధిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లిలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళ డిగ్రీ కళాశాలల ఇంగ్లీష్ విభాగాల మధ్య అకడమిక్ పరంగా పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందం కుదిరింది.

2025-26 విద్యా సంవత్సరం నుంచి 2026-27 విద్యా సంవత్సరం వరకు విద్యార్థులకు, అధ్యాపకులకు నూతన అవకాశాలు కలుగనుండగా, సమకాలీన విద్యా ప్రమాణాలను పెంచడంలో ఇది కీలక భూమిక పోషించనుంది. రెండు కళాశాలల ఇంగ్లీష్ విభాగాధిపతుల పరస్పర సమ్మతితో వివిధ విద్యా, పరిశోధనా, సాంస్కృతిక కార్యక్రమాలు, తాత్కాలిక కోర్సులు, ఇంటర్న్షిప్లు, ఫీల్ ప్రాజెక్టులు నిర్వహించేందుకు అంగీకరించాయి.

అలాగే విద్యార్థుల, బోధన సిబ్బంది మార్పిడి ద్వారా ఒకరికొకరు అనుభవాలను పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు నూతనమైన అభ్యాస మాదిరులు, పరిశోధనా అవకాశాలు అందించబడతాయి.

ముఖ్యంగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సంయుక్త ప్రాజెక్టులు చేపట్టడం, విలువ ఆధారిత కోర్సుల్ని అందించడం వంటి అంశాలు ఈ ఒప్పందానికి ప్రత్యేకతను కలిగిస్తున్నాయి. ఇది విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా రూపొందించబడిన ఒప్పందమని, ఇరు కళాశాలల ప్రిన్సిపాళ్లు తెలిపారు. ఇది ప్రభుత్వ రంగ విద్యాసంస్థల మధ్య ఉన్న అనుసంధానానికి, సమగ్ర విద్యా అభివృద్ధికి ప్రతిరూపమని పేర్కొన్నారు.