04-07-2025 12:48:13 AM
అయిజ, జూలై 3: మండలంలోని దేవ బండ గ్రామ శివారులో భారత్ మాల రోడ్డు లో భూములు కోల్పోయిన రైతులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భారత్ మాల రోడ్లో భూములు కోల్పోయినా రైతులకు మూడో విడత నష్టపరిహారంతో పాటు పైప్ లైన్, చెట్లు తదితర వాటికి సంబంధించి ఇంతవరకు నష్టపరిహారం చె ల్లించలేదని, దీనిపై గతంలోనే నాలుగైదు సార్లు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేసినప్పటికీ అధికారులు గానీ భరత్ మాలా రోడ్డుకు సంబంధించి కాంట్రాక్టర్లు ఎవరు స్పందించలేదని దీంతో మళ్ళీ ధర్నా కార్యక్రమం ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు నష్టపరహారం చెల్లించేంత వర కు నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.