2 September, 2026 | 10:16 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

01-09-2025 | 12:32am

సంస్థాన్ నారాయణపూర్, ఆగస్టు 31 (విజయ క్రాంతి):  అతి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ అన్నారు.

ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని పేద ప్రజలకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని అన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి  తీసుకున్న నిర్ణయము చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త శక్తివంచన లేకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.   

ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి ఏపూరి సతీష్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు రమేష్ నాయక్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాచకొండ రమేష్ బాబు,బీసీ సెల్ మండల అధ్యక్షులు యాదయ్య,యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, బీసీ సంఘం అధ్యక్షులు మారగోని శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.