కాటాపురం పాత బస్టాండు వినాయక మండపం వద్ద అన్నదానం
తాడ్వాయి, ఆగస్టు31 (విజయక్రాంతి): ఏజెన్సీలొ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి దీనిలొ భాగంగా మండలంలోని కాటాపురం పాతబస్టాండులొ వినాక మండపం వద్ద మహిళలు పూజలు నిర్వహిస్తూ మంగళహరతులు పట్టి దూప,దీపనైవేద్యాలు సమర్పిస్తున్నారు విగ్రహదాత గాదె అమృతాచారి కుటుంబ సమేతంగా మండపంలొ పూజలను నిర్వహించారు.
అయ్యగారు సదానందఛారీ మంత్రోశ్చరణ చేయగ కొబ్బరికాయలు కొట్టి విఘ్నేశ్వరునికి మొక్కులు సమర్పించారు. ఈపూజాకార్యక్రమానికి దొరొల్లవాడ, పెరకవాడ బొడ్రాయి గుంపు, క్రాస్ రోడ్డులోని మహిళలు పూలు పండ్లు, పసుపు, కుంకుమలు తెచ్చి గణపయ్యకు సమర్పించుకున్నారు. పాతబస్టాండులోని వినాయక మండపం వద్ద విగ్రహదాత గాదె అమృతాచారీ కుటుంబసమేతంగా ఈ అన్నదానకార్యక్రమానికి హజరయి కావలసిన వస్తువులను సమకూర్చారు.
పులిహోర, పాయశం ప్రసాదం పంపిణిచేశారు, మహిళలు, పిల్లలు, యువకులు, ప్రయణికులు, ఆర్టీసి బస్సు డ్రైవర్, కండాక్టర్, క్రాస్ రోడ్ లోని ప్రజలు, వ్యాపారస్తులు, హజరై అన్నదాన కార్యక్రమంలొ బోజనాలు చేశారు. పాతబష్టాండులొని దొరొళ్లవాడ నుంచి పోలెబోయిన లక్ష్మిపతి, మంచాలబాబు, మహేంద్రాచారీ, పాపాచారీ, మేడిశెట్టిపురుషోత్తం, మహిపతిశీను, పుష్పలత, అల్లెవెంకటేశ్వర్లు, తిరుపతమ్మ, శీరీష, మేడిశెట్టి వెంకన్న, లక్ష్మి, దిడ్డిషూర్య, ఈశ్వరమ్మ,,కమ్మశీను, మేడిశెట్టిసత్యావతి,,మేడిశెడ్డి మహేష్,,దిడ్డిసాంబయ్య, కృష్ణకుమారి, బెల్లంకొండతిరుపతమ్మ ముండ్రాతిబారతమ్మ, గంగమ్మ, టైలర్ సమ్మయ్య, డాక్టర్ రాము, బట్టురాజు, బండారి తిరుపతమ్మ, బండారినారాయణ, యువకులు సేవలందించారు.






