21 June, 2026 | 2:13 PM

వాకింగ్ ట్రాక్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం

21-06-2026 01:19 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం బాధ్యతగా తీసుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ దేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈరోజుల్లో ఆరోగ్యం పైనే ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. చెడు అలవాట్లకు యువత దారి మల్లుతున్నారు అన్నారు.. వైద్యం భారీ ఖర్చుతో కూడుకున్నందున ఉదయాన్నే లేచి వాకింగ్ చేసి యోగ చేయడం ద్వారా రోగాల బారిన పడకుండా ఉండడం జరుగుతుందన్నారు.

మనిషి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నారు.. వాకింగ్కు యోగాకు వయసుతో సంబంధం లేదని అన్నారు.. యోగ ఆసనాలు చేయరని వారు చేయకున్నా పరవాలేదు అన్నారు ఎందుకంటే అనవసరంగా చేసి ఆరోగ్యాన్ని చెడు చేసుకోవద్దు అన్నారు... ఈ సందర్భంగా వాకింగ్ గ్రూపు సభ్యులు డాక్టర్ దేవేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.. అలాగే టీ షర్ట్లు స్పాన్సర్ చేసిన వీరును మరికొంతమందిని గ్రూప్ సభ్యులందరూ సన్మానించారు.. ఈ కార్యక్రమంలో శ్రీ మహాలక్ష్మి వాకింగ్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.