21 June, 2026 | 2:13 PM

సుల్తానాబాద్ లో వర్షాలు కురవాలని నందీశ్వరుడికి, శివుడికి జలాభిషేకం

21-06-2026 01:17 PM

పెద్ద ఎత్తున బిందెలతో పాల్గొన్న మహిళలు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): వర్షాలు కురవాలని మహిళలు నందీశ్వరుడు, శివలింగానికి జలాభిషేకం చేశారు, డప్పు చప్పులతో దేవాలయం చుట్టూ మహిళలు నీళ్ల బిందెలు ఎత్తుకొని  తిరుగుతూ ప్రదక్షిణాలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గుడిమిట్టపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం వర్షాల రాక కోసం ప్రత్యేక పూజలు చేసి నందీశ్వరుడికి, శివుడికి బిందెలతో నీళ్లు పోస్తూ అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ పూజారి పోలాస అశోక్ మహిళలచే ప్రత్యేక పూజలు చేయించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ , అర్చకులు పోలస అశోక్ లు మాట్లాడుతూ... వర్షాకాలం ప్రారంభం అయి నెల రోజులు అవుతున్న ఇప్పటివరకు వర్షాలు పడకపోవడంతో రైతులు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురవాలని నందీశ్వరుని , శివుడిని వేడుకున్నారు, ఈ కార్యక్రమం లో ఆలయ నిత్య భక్తుడు తొడుపునూరి రాజేంద్రప్రసాద్,  కృష్ణంరాజు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ , మహిళలు మల్లమ్మ , రాజేశ్వరి, లక్ష్మి తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.