21-01-2026 01:18:43 AM
మన అగ్రిటెక్‌లో -సైబర్ క్రైం ఏసీపీ గిరికుమార్ అవగాహన
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం ఏసీపీ గిరి కుమార్ అన్నారు. వరంగల్ ఏనమాముల మార్కెట్‌లోని మన అగ్రిటెక్ అధినేత పాషికంటి రమేష్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీపీ గిరి కుమార్ వారి బృందం హాజరై సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థులు, మహిళలు పాటు అన్ని వర్గాల ప్రజలు సైబర్ నేరగాళ్ళ బారిన పడి బారిమొత్తంలో డబ్బులు నష్టపోతున్నారన్నారు. అపరిచిత వ్యక్తులు పంపే లింకులను తెరవద్దని, మోసపూరితమైన యాప్‌ల జోలికి పోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైనట్టు తెలిసిన వెంటనే తమను సంప్రదించాలని సూచించారు.