calender_icon.png 21 January, 2026 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కంట్రీక్లబ్ డార్లింగ్స్ డే ఔట్’

21-01-2026 01:20:36 AM

ప్రి ఫ్యాషన్ షో 

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): బేగంపేట కంట్రీక్లబ్‌లో డార్లింగ్స్ -డే ఔట్ ప్రి ఈవెంట్ ఫ్యాషన్ షో వేడుకగా జరిగింది. కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఏటా ఫిబ్రవరి 13న జరుపుకునే ఆసియాస్ బిగ్గెస్ట్ డార్లింగ్స్ డే ఔట్ -2026లో భాగంగా ఇక్కడి కంట్రీక్లబ్ ఆవరణలో కంట్రిక్లబ్ గ్రూఫ్ చైర్మన్ వై.రాజీవ్ రెడ్డి డార్లింగ్స్- డే ఔట్ అధికారిక పోస్టర్‌ను ఆవిష్కరించడంతో పాటు ‘చలో పట్టాయా’ వీఐపీ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ కార్డును ప్రారంభించారు. ఈ  సందర్భంగా పట్టాయ థీమ్‌తో సాగిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది.

అందాల ముద్దుగుమ్మలు ఇండో-వెస్ట్రన్, పార్టీ వేర్ కలెక్షన్స్ లో అలరించారు. రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ.. కంట్రీ క్లబ్  ఫిబ్రవరి 13న హైదరాబాద్‌తో పాటు  ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, సూరత్, కొల్హాపూర్ నగరాల్లో ఈ వేడుక జరగనున్నాయని తెలిపారు. కుటుంబ సభ్యులంతా కలి సి ఆనందించేందుకు అనువైన వినోద కార్యక్రమాలు ఇందు లో భాగంగా ఉంటాయని చెప్పారు. నూతన సంవత్సర కానుకగా ‘చలో పట్టాయా’ వీఐపీ ఇంటర్నేషనల్ మెం బర్షిప్ కార్డును ప్రవేశపెట్టినట్లు వెల్లడించా రు. ఈ మెంబర్షిప్ ద్వారా పట్టాయాలో రెండు రాత్రులు, మూడు రోజుల ఉచిత వ సతి తో పాటు అంతర్జాతీయ స్థాయి విలాసవంతమైన సదుపాయాలు లభిస్తాయని వివరించారు.