26-05-2025 12:13:23 AM
మంచిర్యాల (విజయక్రాంతి): వాడ బలిజ సేవా సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం మంచిర్యాలలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అశోక్ రోడ్డు అండర్ బ్రిడ్జి దగ్గర సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల మల్లయ్య(District President Errolla Mallaiah) వాడబలిజ సేవా సంఘం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వాడబలిజ సేవా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బోడెంకి మహేష్, కోశాధికారి రాజన్న, ప్రధాన కార్యదర్శి పానెం కుమార్, గగ్గూరి తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి బోడెంకి కుమార్, బొల్లె శ్రీనివాస్, జిల్లాల శ్రీనివాస్, బోడెంకి మనోజ్, బద్ది దేవేందర్, చిక్కాల చంద్రయ్య, పానెం పరశురాం, బోడెంకి రాజేష్, బోడెంకి కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.