14 July, 2026 | 7:19 PM

Breaking News

ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •  

అస్సాంలో బీఫ్‌పై నిషేధం

05-12-2024 02:45 AM

సీఎం హిమంత ప్రకటన

దిస్పూర్, డిసెంబర్ 4: రెస్టారెంట్లు, హోటళ్లలో బీఫ్‌ను వడ్డించడం, తినడంపై నిషేధం విధిస్తున్నట్టు అస్సాం సీఎం హిమంత బిస్వశర్మ బుధవారం ప్రకటించారు. పబ్లిక్ ఫంక్షన్లు, మత సంబంధమైన ప్రదేశాల్లో కూడా ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొన్నారు. గొడ్డు మాంసం వినియోగంపై ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించడానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.

గతంలో దేవయాలకు దగ్గర్లో గొడ్డు మాంసం తినడంపై నిషేధం విధించినట్టు గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ ఆదేశాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినట్టు తెలిపారు. సీఎం ప్రకటన తర్వాత రాష్ట్ర మంత్రి కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. అస్సాం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలన్నారు. లేకపోతే వెళ్లి పాకిస్థాన్‌లో స్థిరపడాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీనిపై ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రజలు ఏం తినాలో, ఏం తినకూడదో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించకూడదని అభిప్రాయపడ్డారు.