calender_icon.png 28 October, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మాయి గొంతుతో నమ్మించి..

28-10-2025 12:28:38 AM

  1. వలపు వలలో చిక్కి రూ. 8 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు

సూర్యాపేట జిల్లాకు చెందిన ముగ్గురు యువకుల అరెస్టు

డీఎస్పీ జీవన్‌రెడ్డి వెల్లడి

ఆదిలాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాం తి): అచ్చం అమ్మాయిల గొంతు మార్చి మాట్లాడుతూ... తీయటి ప్రేమ మాటలతో వలపు వలను విసురుతూ అమాయకులను బుట్టలో దించుతున్న ఓ ముఠాను ఆదిలాబా ద్ పోలీసులు పెట్టకేలకు పట్టుకున్నారు. అమ్మాయిగా గొంతు మార్చి మాట్లాడుతూ... ఓ వ్యక్తి నుండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలను కాజేసిన ముగ్గురు యువకులను పోలీసులు అరె స్టు చేశారు.

ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. పెళ్లిళ్లకు సంబంధించిన ఓ మ్యాట్రి మోనీలో ఓ అందమైన అమ్మాయి ఫోటో పెట్టీ యువకులను బురిడి కొట్టిస్తున్న సూర్యాపేట జిల్లా, మఠంపల్లి మండలం, రామచంద్ర పురం తండాకు చెందిన మాలోత్ మంజి @ కృష్ణవేణి, బుక్య గణేష్, రూపావత్ శ్రావణ్ కుమార్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

వారి నుండి రూ.1,50,000 నగదు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఎం. లక్ష్మీకాంత్‌కు ఓ మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన ఈ ముగ్గురు యువకుల్లో మాలోత్ మంజి అనే యువకుడు కృష్ణవేణి పేరుతో అమ్మాయి గొంతులా మార్చి లక్ష్మీకాంత్‌తో మాట్లాడేవారని తెలిపారు. ఫిబ్రవరిలో వీరు పరిచయం ఏర్పడిందన్నారు.

అప్పటినుండి లక్ష్మీకాంత్ తరచూ ఈ యువకులకు ఆన్లైన్ ద్వారా నగదును పంపేవాడన్నారు. దీంతో రుచి మరిగిన యువకులు సదరు వ్యక్తిని నమ్మించి కృష్ణవేణి అనే అమ్మాయితో పెళ్లి చేస్తామని బురిడీ కొట్టించి సుమారు రూ. 8 లక్షల రూపాయలు వసూలు చేశారని అన్నా రు. గత కొన్ని నెలలుగా డబ్బులు పంపుతు న్న లక్ష్మీకాంత్ మోసపోయానని తెలుసుకొని 1930 ద్వారా సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయ గా, 

ఈనెల 25వ తేదీన వన్ టౌన్ లో కేసు నమోదు చేశామన్నారు. దీంతో ఎస్పీ అఖిల్ మహాజన ఆదేశాల మేరకు సైబర్ సెల్, వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బృందం సూర్యాపేట జిల్లాకు వెళ్లి ఈ ముగ్గురు నిందితులను పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, సైబ ర్ సెల్ ఎస్.ఐ గోపికృష్ణ, వన్ టౌన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గోకుల్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్ రమేష్, ఐటీ సెల్ కానిస్టేబుల్ అన్వేష్, సిబ్బంది పాల్గొన్నారు.