28-10-2025 12:26:20 AM
- గ్యాస్ రీ ఫిల్లింగ్ దందాకు అధికారుల అండ
- పట్టింపులేని జిల్లా సప్లయ్ అధికారులు
- బహిరంగంగా దందా చేస్తున్నా చర్యలు శూన్యం
- నెలనెలా వసూళ్ళలో అధికారులు బిజీ
సంగారెడ్డి, అక్టోబర్ 27(విజయక్రాంతి): పేద, మధ్య తరగతి ప్రజలకు అందించే రాయితీ వంటగ్యాస్ అక్రమార్కులకు కా సులు కురిపిస్తోంది. సబ్సిడీ గ్యాస్ను కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా మినీ సిలిం డర్లలో నింపుతూ, వాహనాలకు గ్యాస్ రీ ఫి ల్లింగ్ చేస్తూ పెద్ద దందా సాగిస్తున్నారు. సబ్సిడీ సిలిండర్లను కొంత మంది వ్యాపారు లు బ్లాక్లో కొనుగోలు చేసి తమ వ్యాపారానికి వినియోగిస్తున్నారు. మరికొందరు అం దులోని ఇంధనాన్ని మినీ సిలిండర్లలో నింపి విక్రయిస్తున్నారు.
మినీ సిలిండర్ల అక్రమ దందా యథేచ్ఛగా సాగిస్తూ ప్రభుత్వ నిబంధనలు పట్టని హోంనీడ్స్ దుకాణాల నిర్వా హకులు మినీ సిలిండర్ సైజ్ను బట్టి డబ్బులు గుంజుతున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు వాహనాలకు సబ్సిడీ గ్యాస్నే వినియోగి స్తు న్నారు. వీరికి గ్యాస్ ఏజెన్సీల డెలివరి బాయ్లే ప్రధాన సరఫరాదారులుగా మారుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధితశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
పట్టణ కేంద్రాల్లో జోరుగా సబ్సిడీ గ్యాస్ రీ ఫిల్లింగ్..
జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, పటాన్చెరు పట్టణ కేంద్రాల్లో సబ్సిడీ గ్యాస్ రీ ఫిల్లింగ్ దందా జోరుగా సాగుతుందని తెలుస్తోంది. జనావాసాల నడుమ అక్రమదందా నడుస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జ రుగుతుందోనని స్థానికులు ఆందోళన చెం దుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని పలు గ్యాస్ ఏజెన్సీలలో ఆటోల ద్వారా గ్యా స్ డెలివరీ చేసే వ్యక్తులు అక్రమార్జనకు తెరలేపి సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్యాస్ డెలివరి సమయంలో వినియోగదారులకు అవసరా ల నిమిత్తం సిలిండర్లను అందిస్తూ వారిని మచ్చిక చేసుకుని వారి పేరుమీద వచ్చిన సబ్సిడీ గ్యాస్ను వీరు రీఫిల్లింగ్ చేసే వారికి లే కుంటే గ్యాస్ వాహనాలు నడిపే వారికి విక్రయిస్తున్నారని తెలుస్తోంది. వీరి అక్రమాలపై నిఘా పెట్టి నియంత్రించాల్సిన అధికారులు నెలవారిగా నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుని పట్టించుకోవడం లేదనే ఆరో పణలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసులు పె డుతూ తర్వాత దందా నడిచేలా పరోక్షంగా సహకరిస్తున్నరనే వాదనలు లేకపోలేదు.
అంతా బహిరంగమే..
పట్టణ, మండల కేంద్రాలకు హోంనీడ్స్ దుకాణాల వారు, వాహనాల్లో గ్యాస్ రీ ఫి ల్లింగ్ చేసే వారు అంతా బహిరంగంగానే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి చిన్న సిలిం డర్లు కొనుగోలు చేసి ఇక్కడకు తెచ్చి వ్యా పారం చేస్తున్నారు. గ్యాస్ రీ ఫిల్లింగ్ చేసే వా రు ముందుగా గ్యాస్ డెలివరి వ్యక్తులకు అడ్రస్ చెప్పి వారి వద్ద గ్యాస్ను డెలివరి చే యించి ఆ తర్వా త వాహనాలలో గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు, చిరువ్యాపారులు, పారిశ్రామిక ప్రాంతాల్లోని కార్మికులు, ఉన్నత చదువుల కోసం వివిధ గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తున్న యువకులు, విద్యార్థులు మినీ సిలిండర్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీరి అవసరాలను ఆసరగా చేసుకొని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.
జనావాసాల మధ్య వ్యాపారం..
జనావాసాల మధ్య అక్రమ దందా నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోవడంలో అధికారు లు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినీ సిలిండర్లు వాడడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. రీ ఫిల్లింగ్ చేసే సమయంలో ఏదైన అనుకోని ప్రమాదం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఇవన్నీ సంబంధిత అధికారులకు తెలిసినా సీరియస్గా తీసుకోకపోవడంపై అ నుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనావాసాల మధ్య కార్లలో, ఆటోల్లో గ్యాస్ నింపే దందా కూడా ఎక్కువగా సాగుతోంది. ప్రభు త్వం ఆమోదం పొందిన పలు గ్యాస్ కంపెనీలు మార్కెట్లో 5 కిలోల సిలిండర్లు సరఫరా చేస్తున్నాయి. వీటిని వినియోగించేందుకు జనం ఆసక్తి చూపడం లేదు. దీనిపై అవగాహన కల్పించాల్సిన అధికారులు చూసీచూడ నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా కేంద్రంతో పాటు పట్టణ, మండల కేంద్రాల్లో గ్యాస్ సరఫరా చేస్తున్న డెలివరి బాయ్స్పై ప్రత్యేక నిఘా ఉంచితే సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టకుండా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయామ్.. వేరీ బిజీ...
అక్రమ గ్యాస్ దందాపై సంగారెడ్డి డీసీఎస్వో వనజాతను వివరణ కోసం ప్రయ త్నించగా అయామ్ వేరీ బిజీ..మీటింగ్ వెళ్తు న్నా అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చా రు. వాట్సాప్లో వివరణ కోరగా స్పందించక పోవడం గమనార్హం.