17-12-2025 07:13:20 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ) విద్యార్థి పొట్ట లక్ష్మీనరసింహ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన ఎంపికయ్యాడు. 9వ తరగతి చదువుతున్న సదరు విద్యార్థి ఈనెల 8వ తారీకు కాగజ్నగర్ పట్టణంలో అండర్ 14 విభాగంలో బాక్సింగ్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి బంగారు పథకాన్ని కైవాసం చేసుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కయ్యాడనీ ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఇండివిడ్ ఈవెంట్స్ ఈవెంట్స్ లో ప్రతిభ కనబరిచి క్రీడా భవిష్యత్తుతో పాటు క్రమశిక్షణ అలవర్సుందన్నారు. కళాశాల అధ్యాపక బృందం విద్యార్థికి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో దశరథం కొండలరావు, విజయ్ వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, ముచ్చక్కుర్తి రాజశేఖర్ పాల్గొన్నారు.