calender_icon.png 17 December, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగా గురువు బోయ ఉమారాణికి సన్మానం..

17-12-2025 07:58:36 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ప్రముఖ యోగ గురువు బోయ ఉమారాణిని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డాక్టరేట్ యోగ డైనమిక్ అవార్డును అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే అమ్రాజుల శ్రీదేవి నివాసంలో బుధవారం రాత్రి సత్కరించి సన్మానం చేశారు. యోగా గురువు ఉమారాణి యోగ శిబిరాలను నిర్వహిస్తూ ఎంతోమంది ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నదని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఈ సందర్భంగా ఆమె సేవలను కొనియాడారు.

యోగ రంగంలో మరింత ఉన్నత శిఖరాలకు ఎదిగి బెల్లంపల్లికి జాతీయస్థాయిలో మరింత గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి నివాసంలో యోగా శిక్షణ శిబిరంలో యోగాను అభ్యసిస్తున్న మున్సిపల్ మాజీ చైర్మన్, రిటైర్డ్ సింగరేణి అధికారి అమ్మ రాజుల రాజేశ్వర్, యోగ యోగ అభ్యాసకులు, లలిత, దివ్య, మాధవి, మానస, సుజాత, అనిత, భూలక్ష్మి మహిళలు అవార్డు గ్రహీత ఉమారాణిని సన్మానించారు.