calender_icon.png 17 December, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేయూ నాన్ టీచింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

17-12-2025 08:02:58 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): కేయూ రిటైర్డ్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని, రిటైర్డ్ నాన్ టీచింగ్ ఉద్యోగులకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని, సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉన్నదని, పెన్షన్, వైద్య సదుపాయాలు ఇతర హక్కులు సమయానికి అందేలా చూసుకుంటుందని అన్నారు.

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ వైస్ ఛాన్స్లర్ ఆచార్య ప్రతాపరెడ్డి, కేయూ రిజిస్టర్ ఆచార్య వి. రామచంద్రం, కేయూ రిటైర్డ్ నాన్ టీచింగ్ ఎంప్లాయ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం. సంజీవరావు, నాయకులు డాక్టర్ ఎన్.ఎస్.ఆర్. మూర్తి, కృష్ణమాచార్య, ప్రకాశం, గీడియోన్, ప్రభాకర్, వెంకట్రాం నరసయ్య, నరసింహమూర్తి, అక్తర్, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.