calender_icon.png 17 December, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు

17-12-2025 08:06:18 PM

- 88.21 శాతం పోలింగ్ 

మందమర్రి, (విజయక్రాంతి): మందమర్రి మండలంలో 10 గ్రామ పంచాయతీలుండగా ఒక జీపీ ఏకగ్రీవం కాగా తొమ్మిది జీపీలకు, 86 వార్డులలో 21 వార్డులు ఏకగ్రీవం కాగా 65 వార్డులకు బుధవారం ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. మండలంలో 11,127 (5,502 పురుషులు, 5,624 మహిళలు, ఇతరులు ఒకరు) మంది ఓటర్లున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తొమ్మిది గంటల వరకు 3,886 (34.92%), 11 గంటల వరకు 7,737 (69.53%), మధ్యాహ్నం ఒంటి గంట వరకు 9,301 (83.59%) పోలింగ్ జరిగింది. ఒంటి గంట తర్వాత పోలింగ్ కేంద్రాలలో క్యూలో నిలబడ్డ వారు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఓట్ల సంఖ్య 9,815 (4,854 పురుషులు, 4,960 మహిళలు, ఇతరులు 1)కి పెరిగింది. దీనితో 88.21 శాతానికి పోలింగ్ చేరుకుంది. మండలంలోని తొమ్మిది జీపీలకు 38 మంది, 65 వార్డులకు 186 మంది పోటీపడ్డారు. 

విజేతలు వీరే...

మండలంలోని పది గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన నలుగురు, ఇండిపెండెంట్లు నలుగురు, బీఆర్ఎస్ బలపర్చిన ఇద్దరు విజయం సాధించారు. మండలంలోని శంకర్ పల్లి జీపీ సర్పంచుగా పెరుమాల్ల వెంకటేష్ (కాంగ్రెస్ రెబల్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదిల్ పేట జీపీ సర్పంచుగా నిండుకూరు పున్నం (ఇండిపెండెంటు), సారంగపల్లి (తుర్కపల్లి) సర్పంచుగా బచ్చలి రాములు (ఇండిపెండెంటు), పులిమడుగు సర్పంచుగా భుక్య బుజ్జి (ఇండిపెండెంటు), మామిడిగట్టు సర్పంచుగా సుంకరి దివ్య సతీష్ (ఇండిపెండెంటు), అందుగుల పేట సర్పంచుగా ముత్యం రమ (కాంగ్రెస్), బొక్కలగుట్ట సర్పంచుగా మాసు శ్రీనివాస్ (కాంగ్రెస్), చిర్రకుంట సర్పంచుగా రాంటెంకి శ్రీలత తిరుపతి (కాంగ్రెస్), పొన్నారం సర్పంచుగా పెంచాల మధు (బీఆర్ఎస్), వెంకటాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచుగా సేగ్యం వెంకటేష్ (బీఆర్ఎస్) విజయం సాధించారు.