calender_icon.png 17 December, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న దుద్దిళ్ల శ్రీనుబాబు

17-12-2025 07:47:47 PM

మంథని (విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం ధన్వాడలో బుధవారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వగ్రామమైన ధన్వాడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు శ్రీను బాబు కృతజ్ఞతలు తెలిపారు.