17-12-2025 07:53:19 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం పెద్దపల్లి డీసీపీ బి. రాంరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్ తో కలిసి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి పోలింగ్ సరళి, ఓట్ల లెక్కింపును పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సీసీ కెమెరాలను స్థానిక ఠాణాకు అనుసంధానం చేశారు. ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్న డీసీపీ రాంరెడ్డి ఠాణా నుంచే పోలింగ్ కేంద్రాల పరిస్థితిని సమీక్షించారు.
అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేశారు. మండలంలోని సమస్యాత్మక కేంద్రాల్లో ముందస్తుగా భద్రతా బలగాలను మోహరించారు. గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలను తీయవద్దని పేర్కొన్నారు. అలాగే సుల్తానాబాద్ మండలంలోని గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎసిపి జీ, కృష్ణ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ లు పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.