calender_icon.png 17 December, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాలెంట్ టెస్టుల్లో ఎస్ఆర్ఎం విద్యార్థుల ప్రతిభ

17-12-2025 08:00:43 PM

కోదాడ: కోదాడ పట్టణానికి చెందిన ఎస్ఆర్ఎం స్కూల్ విద్యార్థులు పలు టాలెంట్ టెస్టుల్లో ప్రతిభ కనబర్చారు. విజేతలను ఎంఈఓ సలీం షరీఫ్ బుధవారం అభినందించారు. కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి మాట్లాడుతూ రామానుజన్ టాలెంట్ టెస్ట్ వారు సూర్యాపేటలో నిర్వహించిన గణిత ప్రతిభా పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు సిద్దు, సాయి సంతోష్, హర్షిత్, అభిషేక్, ఆరాధ్యలు జిల్లా స్థాయిలో 1, 2, 3 ర్యాంకులు సాధించారన్నారు. సూర్యాపేటలో జరిగిన ఏఎస్ రావు టాలెంట్ టెస్టులో పి ఆశ్రిత, కారుణ్య శ్రీ, హిమానితారెడ్డిలు ప్రతిభ కనబర్చి సెకండ్ లెవల్ కు అర్హత సాధించారన్నారు. విజేతలకు కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.