17-12-2025 07:37:43 PM
కేటీపీఎస్ కాలనీలో విషాదం
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ ఏడవ దశలో డిఈగా విధులు నిర్వర్తిస్తున్న బలరాం కుమారుడు శ్రీ కేతన్ హైదరాబాద్ లో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇగ్నైట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవటంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు.