calender_icon.png 30 December, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిన్నిస్ బుక్ లో బెల్లంపల్లి విద్యార్థినీ ఆద్యకు చోటు

30-12-2025 03:39:16 PM

కూచిపూడి నృత్య పోటీలు.. 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ విద్యార్థినీ గిన్నిస్ బుక్ లో రికార్డు సొంతం చేసుకుంది. పట్టణంలోని గోల్బంగ్లాబస్తీకి చెందిన దాముక ఆద్య అనే విద్యార్థిని మాతృ మందిర్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 27 న భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి నాట్య పోటీలో పాల్గొనీ  నాట్య రంగంలో తన ప్రతిభను చాటుకుంది. ఈ పోటీలకు బెల్లంపల్లి నుంచి 23 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విద్యార్థులు కాల్ టెక్స్ కు  చెందిన నటరాజ అకాడమీ సంస్థ గురువు అర్చన నేతృత్వంలో  శిక్షణ  పొందారు. కూచి పూడి నృత్య పోటీలో గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించిన ఆద్య సర్టిఫికెట్ తో పాటు బహుమతి అందుకున్నారు. గిన్నిస్ బుక్ రికార్డు దక్కించుకున్న ఆద్య ను కూచిపూడి నృత్యం అకాడమీ గురువు అర్చన, పాఠశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు రమా సాగర్, రవళి అభినదించారు.