10-06-2025 10:30:37 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ పట్టణంలో మంగళవారం జపాన్ కరాటే అసోసియేషన్(Japan Karate Association) ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ పోటీలు నిర్వహించి, బెల్టు ప్రధాన ఉత్సవం జరిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ ఆరిఫ్ ఖాన్ మాట్లాడుతూ... ప్రస్తుత కాలంలో మహిళలు, పురుషులు అని తేడా లేకుండా ఆత్మ సంరక్షణ నైపుణ్యంలో భాగంగా కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బెల్టులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఆ శాఖ స్టేట్ ప్రెసిడెంట్ తేజిందర్ సింగ్ భాటియా, కొండాజి శ్రీకాంత్, చందుల స్వామి, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.